బెంగళూరు బుల్స్ సందర్శనతో కృష్ణాపురం పూర్తిగా నిండిపోయింది!
10 నవం, శుక్ర
|Krishnapuram World Village
Time & Location
10, నవం 2023 7:00 PM
Krishnapuram World Village , Govardhanapuram, Avanthi road, Govardhanapuram, Varadaiahpalem, Andhra Pradesh 517541, India
About the event
బెంగుళూరు బుల్స్ ప్రత్యేకత: లోకా ఫౌండేషన్‌తో కలసి జ్ఞానం పొందారు, పండుగ చేసుకున్నారు, పూర్తి ఉత్తేజితులైయ్యారు.
లోకా ఫౌండేషన్ బెంగళూరు బుల్స్ కబాడీ టీం కి వారి సాధారణ ప్రాక్టీసును దాటి ఒక అలౌకికమైన అనుభూతిని ఇచ్చింది. ఈ అనుభూతి వారి సంపూర్ణ ఆయుః ఆరోగ్యాలకు, అంతరంగ బలానికి, చెక్కుచెదరని ఏకాగ్రతకు రూపొందించిన ప్రయాణం. ఇది కబాడి పోటీలలో మాత్రమే కాకుండా రోజు వారి జీవితానికి కూడా తోడ్పడం కోసం.
తీవ్రమైన వారి శిక్షణలో, విశ్రాంతి దొరికినప్పుడు వారు ప్రశాంతమైన క్రిష్ణాపురం గ్రామాన్ని సందర్శించారు. రోజు వారి జీవితంలో ఒత్తిడి లేని స్థితిలో జీవించడమ కోసం చాలా శక్తివంతమైన ధ్యానం కూడా నేర్చుకున్నారు.ఈ ప్రాక్టీసు వలన క్రీడాకారులందరికి వారి అంతరంగ స్థైర్యం, ఏకాగ్రత, శ్రద్ద పెంచుకోవడానికి సులభమైంది.
ఈ అధ్భుతమైన శక్తితో, బుల్స్ పూర్తి ఏకాగ్రతతో శిక్షణలో పాల్గొన్నారు.
వారి శిక్షణ సమయంలో దీపావళి పండుగను కూడా ఆనందంగా జరుపుకున్నారు. స్వయంగా వారే మట్టి ప్రమిదలు చేసి, దీపాలు వెలిగించి వెలుగులతో నిండిన ప్రశాంత వాతావరణాన్ని అనుభవించారు. భౌతిక శిక్షణలో మునిగిపోయిన వీరు భూమాతతో, మట్టి దీపాలు చేస్చున్నప్పుడు వారిలో శాంతి, ధ్యేయం దృఢపడింది.
దీపావళి పండుగ వరల్డ్ విలేజ్ గాంధీపురం గ్రామస్థులు సాంప్రదాయంగా ఆడిన కోలాటాలతో పూర్తయింది. కోలాటాల లయబద్ధమైన అడుగులు, వారి రంగురంగుల దుస్తులు, వారితో కలసి బుల్స్ చేసిన కోలాటం గ్రామస్థులకు, బుల్స్ కి మరువలేని తీపి గుర్తుగా నిలిచిపోయింది.
లోకాఫౌండేషన్ తో, బెంగుళూరు బుల్స్ కొలాబరేషన్ కబాడి పరిధులను ని మించిపోయింది. ఈ అనుభవం వారిలో శ్రద్ద, సుస్థిరత, సంస్కృతిలో శక్తివంతమైన ముద్రను వేసింది. అద్భుతంగా ప్రదర్శించడానికి కేవలం భౌతిక శిక్షణ మాత్రమే కాదు, అంతరంగంలో ప్రశాంతత, ఆనందం, వివిధ సంస్కృతుల కలయిక ఇవన్ని కూడా అవసరం అని రూఢి అయ్యింది.