top of page
  • Facebook
  • Instagram
  • X
  • Youtube
  • LinkedIn

23 జన, మంగళ

|

BODHI Campus

లోకా ఫౌండేషన్ కార్యాలయం ప్రారంభోత్సవం

Registration is closed
See other events
లోకా ఫౌండేషన్  కార్యాలయం ప్రారంభోత్సవం
లోకా ఫౌండేషన్  కార్యాలయం ప్రారంభోత్సవం

Time & Location

23, జన 2024 7:00 PM

BODHI Campus, Govardhanapuram, Avanthi road, Govardhanapuram, Varadaiahpalem, Andhra Pradesh 517541, India

About the event

ఉత్సాహభరిత కేంద్ర వికాసం: మనము కలసి పంచుకుంటున్న ద్యేయానికి స్థావరం. 


 జనవరి 23,2024 న మా అందరి హృదయాలు పొంగిపొరలాయి. మీతోపాటు కలలు కంటూ, వాటిని వాస్తవం చేస్తున్న మేము, ఆ రోజు అవకాశాలను వాస్తవాలుగా చేసే స్థానం, మనమందరము పయనిస్తున్న విప్లవాత్మక మార్పుకు ఒక శాశ్వత స్థానాన్ని ప్రారంభించాము. 


ఈ స్థానం కొత్త నాగరికతకు లాంచింగ్ పాడ్ లాంటిది. లోకపౌండేషన్ లో మేము భూమికి అనుకూలంగా జీవించే జీవన విధానంలోనే మానవాళి పురోగతి ఉందని నమ్ముతాము. మనుషులకు మొదటి స్థానం ఇస్తాము, ఎందుకంటే సాధికారత కలిగిన వర్గాల పైననే సుస్థిర జీవనం ఆధారపడి ఉంది. మా ప్రతి ఆలోచనా సరళి సామూహిక పరివర్తన వైపుగానే ప్రయాణిస్తుంది. మేము సుస్థిరత, సామాజిక అభివృద్ధి రెండు కలసి మెలసి.అభివృద్ధి చెందే భవిష్యత్తు కొరకు పాటుపడుతున్నాము. 


ఈ కొత్త అందమైన మా కేంద్రం కేవలం పనిచేసే స్థలం మాత్రమే కాదు: సామూహికంగా చేసే చర్యల శక్తికి స్థానం. ఈ నాలుగు గోడల మధ్యన వాలంటీర్లు, సపోర్టర్లు, నీలాగ, నాలాగ గొప్ప భవిష్యత్తు గురించి కలగనే వారు వారి ఐడియాలను, కొత్త భావాలను, పంచుకుని మంచి ప్రపంచాన్ని కలసి సృష్టిస్తారు. ఇది అవకాశాలకు మెండైన స్థలం, ఇది ఉన్నతమైన మార్పులను తీసుకురాగలిగే వ్యక్తులను పుట్టించే స్థలం. 


ఇది కేవలం లోకా ఫౌండేషన్ ప్రయాణం మాత్రమే కాదు; ప్రేమ నిండిన భవిష్యత్తు కోసం కలలు కనే ప్రతి ఒక్కరిని ఆహ్వానించి, ఆకర్షించే ప్రయాణం. మాతో పాటు మీరు చేయు కలపండి. మనమందరం కలసి కొత్తప్రపంచాన్ని సృష్టించుకుందాం. సుస్థిరతతో కూడిన మానవాళి అభివృద్ధి రాబోయే తరాల వారిని వికసింప చేస్తుంది.


Share this event

bottom of page